వర్క్ మోడ్ లో వరుణ్

Mega Prince Varun Tej Shares A Selfie From The Sets Of New Movie On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Prince Varun Tej,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,VarunTej Konidela,Tollywood Actor,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Movie Telugu,Ghani Movie Updates,Varun Tej Shares A Selfie,Varun Tej New Movie,Varun Tej Selfie,Varun Tej Latest Pic,Varun Tej In Work Mode,Varun Tej Work Mode,Varun Tej Upcoming Movie Details On Cards,Varun Tej Latest Selfie,Varun Tej Ghani

‘ముకుంద’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే మొదటి సినిమా అంత విజయం అందించలేకపోయినా రెండో సినిమా ‘కంచె’తోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను గని అని పెట్టి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. గని సినిమా రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వరుణ్ ఒక వైపు గని షూటింగ్ లో పాల్గొంటూనే.. మరోవైపు ఎఫ్ 3 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా బిజీ బిజీ గా గడుపుతున్న వరుణ్.. వర్క్ మోడ్ అంటూ ఒక ఫొటో ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్ కు ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =