మొత్తానికి రజినీ అభిమానులకు కాస్త ఊరట లభించింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సంగతి కూడా విదితమే. అయితే ప్రస్తుతం రజినీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి అనారోగ్యం లేదని అయితే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇక మూడు రోజుల నుంచి హాస్పిటల్ లో ఉన్న రజినీ డిశ్చార్జ్ అయ్యారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే వారం రోజుల పాటు విశ్రాంతి కోసం ఆయన చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. రజనీకాంత్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది.
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: