మొదటి జాతిరత్నం – జోగిపేట్ శ్రీకాంత్ నవీన్ పోలిశెట్టి

JathiRatnalu Movie Live Updates, JathiRatnalu Movie Team, JathiRatnalu Movie Team Releases First Glimpse, JathiRatnalu Movie Team Releases First Glimpse Of Naveen Polisetty, Jathiratnalu Movie Updates, JathiRatnalu Telugu Movie Latest News, Latest Telugu Movies News, Naveen Polishetty, Naveen Polishetty As Jogipet Srikanth, Naveen Polishetty Jathi Ratnalu, Naveen Polishetty Jathi Ratnalu Movie, Naveen Polishetty New Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు నవీన్ పోలిశెట్టి. త‌న‌దైన యాక్టింగ్ స్టైల్ తో అంద‌రినీ అల‌రించాడు. ఇప్పుడు జాతి రత్నాలు అనే మరో కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా న‌వీన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానితో పాటు నవీన్ పాత్రను పరిచయం చేస్తూ చిన్న టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. జోగిపేట్ శ్రీకాంత్ అనే ఖైదీగా ఈ సినిమాలో క‌నిపిస్తున్నాడు న‌వీన్ పొలిశెట్టి. మీ ఖాకీబ‌ట్ట‌లు, తుపాకీ గుండ్లు మా నోళ్లు నొక్క‌లేవు ఇన్ స్పెక్టర్ అంటూ న‌వీన్ పొలిశెట్టి చెబుతున్న డైలాగ్స్ ఫ‌న్నీగా ఉన్నాయి. ఇక ఈ టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. మరి ప్రియదర్శి, రాహుల్, నవీన్ పోలిశెట్టి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కామెడీ కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం వీరు ముగ్గురు కలిసి ఎంత నవ్విస్తారో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.