హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత నాని, దర్శకులు రాహుల్ సంక్రుత్యన్ , వివేక్ ఆత్రేయ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో “శ్యామ్ సింగ రాయ్ “మూవీ తెరకెక్కనుంది. డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో ముగ్గురు కథానాయిక లలో ఇప్పటి వరకూ సాయి పల్లవి , కృతి శెట్టి ఎంపిక అయ్యారు. “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో హీరో నాని ఫిల్మ్ డైరెక్టర్ గా నటించనున్నారని సమాచారం. హీరో నాని రియల్ లైఫ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ కావాలనే నాని కల రీల్ లైఫ్ లో “శ్యామ్ సింగ రాయ్ “మూవీ ద్వారా నెరవేరనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: