“ఛలో “, గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో అగ్ర తార గా రాణిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం “పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీ లోని తన పాత్ర కై రష్మిక రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకున్నారు. శర్వానంద్ “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 10. 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న రష్మిక లేటెస్ట్ ఫొటోస్ తో వారిని అలరిస్తున్నారు. రీసెంట్ గా గోవా విహార యాత్ర కు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్న రష్మిక ఇప్పుడు వైట్ అవుట్ ఫిట్ తో ఉన్న తన అందమైన ఫొటోను “అయ్యో రామా ” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ అందమైన రష్మిక ఫొటో అభిమానుల , ఫాలోవర్స్ హృదయాలను గెలుచుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: