బాగ్ బాస్ 4 కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవల వైల్డ్ డాగ్ షూటింగ్ లో భాగంగా నాగార్జున ఒక వారం ఆ భాద్యతలు కోడలు సమంతకి అప్పజెప్పిన సంగతి కూడా తెలుసు కదా. ఇక మొత్తానికి మామకు తగ్గ కోడలు అనిపించుకుంది ఈ షో కి హోస్ట్ గా చేసి. అంతేకాదు సమంత వచ్చిన షోకి టీఆర్పీ రేటింగ్ కూడా ఒక రేంజ్ లోనే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న సమంతను ఈ షో గురించి.. తన హోస్టింగ్ గురించి పలు ప్రశ్నలు అడుగగా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. నేను బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేయాలని మామ (నాగార్జున) నిర్ణయించారు.నేను చాలా హ్యాపీ గా ఉన్నాయి అది సక్సెస్ అయినందుకు చెప్పింది. ఇక మరోకరు బిగ్ బాస్ షో కి మొదటిసారి హోస్ట్ చేశారు కదా టెన్షన్ ఫీల్ అయ్యారా అని అడుగగా.. నిజం చెప్పాలంటే ఆ టైం లో నిద్ర కూడా సరిగా పట్టలేదు.. షో లో అయితే బాగా నవ్వాను కానీ కొంచెం టెన్షన్ పడ్డాను.. అప్పటివరకు నేను బిగ్ బాస్ ను పెద్దగా చూడలేదు.. హోస్టింగ్ అనగానే మూడు రోజుల్లో ఎపిసోడ్స్ మొత్తం చూసాను వాళ్ళ గురించి తెలుసుకున్నాను అని చెప్పింది. హార్డ్ వర్క్ అయితే చేసాను ఎందుకంటే ఇది మామ షో.. మామగారి పేరు నిలబెట్టాలి.. అది ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. బెస్ట్ ఇవ్వగలిగాను అని తెలిపింది. మరి ఇంత హార్డ్ వర్క్ లేకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉండేదా..
ఏమాయ చేసావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన సమంత తన అందం, అభినయంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్ళైన తర్వాత కూడా వరుస విజయాలు దక్కించుకొని అందరికంటే భిన్నం అని రుజువు చేసింది. అంతేనా ఈ మధ్య ఆర్గానిక్ ఫామింగ్ అంటూ ఆ టిప్స్ కూడా చెపుతుంది. బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టేసింది. అందుకే మరి ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది.. పలువురికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: