రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ ను కూడా అప్పుడే విడుదల చేశారు. అయితే కరోనా వల్ల ఇన్నిరోజులు షూటింగ్ కు వెళ్ళలేదు ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా షూట్ ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్‌కు అందించారు. నేటి నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశభక్తి నేపథ్యంలో సినిమాతో రాబోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా కొల్లెక్షన్ కింగ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: