‘పాన్ ఇండియన్ స్టార్’ ప్రభాస్ – హ్యాపీ బర్త్ డే

Happy Birthday To Pan Indian Star Rebel Star Prabhas

ఒక హీరోగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కు ఎదగాలంటేనే ఎన్నో ఏళ్ళ కష్టం ఉంటుంది. ఎంత వారసులైన ఆడియన్స్ తమలోని టాలెంట్ కు మాత్రమే ఓట్లు వేస్తారు. స్టార్ హీరోలను చేస్తారు. అలాంటిది తెలుగు సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్ ను దాటి జాతీయ.. అంతర్జాతీయ స్థాయి రేంజ్ కు ఎదగడం అంటే మాములు విషయం కాదు. అలా స్థాయికి వచ్చిన హీరో ఎవరో ఇప్పటికే అర్థమైనట్టుంది. ఇంకెవరు టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుడు.. బాహుబలి ప్రభాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ఇక ప్రభాస్ కూడా అరడుగులు ఉన్నాడు.. బాగానే చేశాడు… ఫర్వాలేదు.. అంటూ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమా ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది. అదే వర్షం సినిమా ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ‘వర్షం’ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ను మార్చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ మూడు ఫెయిల్ కాగా, పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనంతరం వచ్చిన రెండు సినిమాలు భిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు ఫెయిల్ కాగా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ కొట్టాయి. దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించాయి. పాన్ ఇండియాగా వచ్చిన సాహో సినిమా కూడా మంచి హిట్ విజయం దక్కించుకుంది. ఎన్ని సినిమాలు చేశాం అన్నది ముఖ్యం కాదు జనం ఎంతలా గుర్తు పెట్టుకునే పాత్ర చేశాం అన్నదే ప్రభాస్ సిద్ధాంతం. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కనుక ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

డార్లింగ్ ప్రభాస్..

టాలీవుడ్ లో అందరికీ డార్లింగ్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చేది ఇంకెవరూ డార్లింగ్ ప్రభాస్. తన వండర్ఫుల్ బిహేవియర్ కూడా ప్రభాస్ పాపులారిటీకి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. డార్లింగ్ డార్లింగ్ అంటూ తన డౌన్ టు ఎర్త్ ఉండే స్వభావంతో అందరినీ కట్టిపడేస్తాడు. ఈ విధంగా యాటిట్యూడ్ తో కాకుండా సంస్కారవంతమైన బిహేవియర్ తో ఆకట్టుకోవడం కూడా ప్రభాస్ పాపులారిటీకి ఒక ప్రధాన కారణం అయింది.

నార్త్ డామినేషన్ కు చెక్..

ఒక రకంగా నార్త్ డామినేషన్ కు బాహుబలితో చెక్ పెట్టిన హీరో ప్రభాస్. మన సౌత్ పై నార్త్ సినిమాల డామినేషన్ ఎంత ఉంటుందో సినిమా పరిజ్ఙానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఆ డామినేషన్ ను మన తెలుగు సినిమా బాహుబలి తగ్గించారు. ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలుసు. మన తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే వీరివల్లే. ప్రభాస్ లేకపోతే బాహుబలి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ ను నమ్మి 5 సంవత్సరాలు ఒక సినిమా కోసం కేటాయించడం అంటే మాములు విషయం కాదు.. అది కూడా కెరీర్ పీక్స్ లో వున్నప్పుడు. కానీ ఆ ధైర్యం చేసిన ఏకైక వ్యక్తి ప్రభాస్. 2015, 2017 సంవత్సరాలలో విడుదలై ప్రపంచ సినిమా చరిత్రలో ఒక అనితరసాధ్యమైన అద్భుతంగా నిలిచిపోయిన బాహుబలి సిరీస్ తర్వాత ఆ ప్రభంజనాన్ని, ఆ కలెక్షన్లను దరిజేరగల ఇండియన్ ఫిలిం మరొకటి రాలేదు. ఉత్తరభారతంలో ఏ సినిమా విజయమైనా ‘నాన్ బాహుబలి’ రికార్డ్స్ కు పరిమితమవడమే తప్ప బాహుబలి రికార్డ్స్ దరిదాపులకు కూడా వెళ్లలేకపోతున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా సినిమా సాహో కూడా సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

తొలి సౌత్ ఇండియన్ స్టార్

ప్రతిష్టాత్మక మేడమ్ ట్యూసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహ ప్రతిష్టాపన అనే ఘనతను సాధించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా మరో రికార్డు క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్. దీనితో పాటు ఆసియాలో సెక్సియేస్ట్ ఏసియన్ మ్యాన్ ఆఫ్ 2019 జాబితా లో ప్రభాస్ 10వ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు సంపాదించుకుంటున్న తొలి సౌత్ హీరో గా కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్.

బిజినెస్

ఇక కొత్తగా బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు ప్రభాస్. సూళ్లూరు పేటలో V ఎపిక్ మల్టీ ప్లెక్స్ ప్రారంభించారు ప్రభాస్. మూడు ఎకరాలలో నిర్మించిన మల్టీ ప్లెక్స్ లో అత్యాధునిక సాంకేతికత తో రూపొందిన మూడు స్క్రీన్స్ ఉన్నాయి. గేమింగ్ జోన్, షాపింగ్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఒక థియేటర్ స్క్రీన్ 100అడుగులు ఎత్తు, 54 అడుగుల వెడల్పు తో ఉంది. 656 సీటింగ్ కెపాసిటీ, 4K రిజల్యూషన్ తో ఈ స్క్రీన్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్.

ఇక 17 సంవత్సరాలలో 19 చిత్రాలలో నటించిన ప్రభాస్ బాహుబలి సిరీస్ సాహో చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలను మాత్రమే లోనే లో పెట్టాడు. ప్రభాస్ 20 వ సినిమాగా ‘రాధే శ్యామ్’.. 21 వ సినిమా నాగ్ అశ్విన్ సినిమా ఇది ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో తీస్తున్నారు.. ఇంకా 22 వ సినిమాగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. మరి స్టార్ హీరో రేంజ్ నుండి జాతీయ స్టార్ గా శిఖరాగ్ర స్థాయి దాకా వెళ్లిన ప్రభాస్ ముందు ముందు ఇంకా తెలుగు ప్రజలు గుర్తుంచుకునే సినిమాలు తీయాలని… తెలుగు సినిమా ఖ్యాతి ఇంకా పెంచే సినిమాలు తీయాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − sixteen =