సమంత కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Samantha Ruth Prabhu's First Look Revealed From Maa Inti Bangaram

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కొన్ని రోజులుగా దానికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా తన తదుపరి సినిమాను ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం జన్మదినం సందర్భంగా కొత్త మూవీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ నయా ప్రాజెక్ట్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అలాగే ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సమంత లుక్ ఆసక్తి రేపుతోంది. ఎర్ర చీర కట్టి, నుదుటున బొట్టు పెట్టి, చేతిలో తుపాకీతో వీరనారిగా ఆమె కనిపించింది. ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. గత కొన్ని రోజుల క్రితం ‘ట్రాలాల మూవింగ్ పిక్టర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ‘మా ఇంటి బంగారం’లో తాను కథానాయికగా నటిస్తుండటం గమనార్హం. కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత నిన్నటితో 37వ ఏట అడుగుపెట్టింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.