‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ రిలీజ్

Radhe Shyam Movie Team Release Motion Poster Today On The Occassion Of Prabhas Birthday

గతరెండు నెలల నుండి ప్రభాస్ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక అప్ డేట్ రావడమే గగనంగా ఉండేది. అభిమానులు కూడా ఎంతగానే ఎదురుచూసేవారు. కానీ ఈ మధ్య సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెండు రోజుల నుండే ఆ హడావిడి మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ముందుగా చెప్పినట్టే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో అదుర్స్ అనేలా ఉంది. ప్ర‌భాస్, పూజాల మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్‌ను అద్భుతంగా ఆవిష్క‌రించారు. ముందు రోమియో-జులియేట్‌, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్‌ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్‌ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. మరి చూడబోతే ఈ సినిమా కూడా ప్రేమ కావ్యంలా రూపొందించనున్నట్టు తెలుస్తుంది. దానితో పాటు రాధాకృష్ణులకు సంబంధించిన శ్లోకం ఈ సందర్భంగా బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది. జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =