త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన “అల .. వైకుంఠపురములో ..” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు “అల .. వైకుంఠపురములో ..” మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రోహిత్ ధవన్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ “పతి పత్ని ఔర్ వో ” మూవీ ఫేమ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా “అల .. వైకుంఠపురములో ..” మూవీ హిందీలో రీమేక్ కానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా “భూల్ భులయ్యా 2 “, దోస్తానా 2 ” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. జాన్వీ కపూర్ ఈ ఆఫర్ ను అంగీకరిస్తే తెలుగు వెర్షన్ లో పూజాహెగ్డే నటించిన పాత్రలో నటించాల్సి ఉంది. జాన్వీ కపూర్ నటించిన “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ “, “రూహి అఫ్జానా ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జాన్వీ కపూర్ ప్రస్తుతం “దోస్తానా 2 ” మూవీలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటిస్తున్నారు. .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: