సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో నటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సుధీర్ బాబు “ప్రేమ కథా చిత్రమ్ “, “సమ్మోహనం “సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “బాఘీ” మూవీ తో సుధీర్ బాబు బాలీవుడ్ కు ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సుధీర్ బాబు, ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై “నన్ను దోచుకుందువటే ” మూవీ ని నటించి, నిర్మించారు. నిర్మాత గా మారిన సుధీర్ బాబు ఇప్పుడు ఫిల్మ్ స్టూడియో అధినేతగా మారనున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు మాట్లాడుతూ .. మూవీ షూటింగ్స్ కై ఒక స్టూడియో ను నెలకొల్పాలనుకొంటున్నట్టు , స్టూడియో కు అనువుగా ఉండే ప్లేస్ గురించి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిచ్చే సుధీర్ బాబు ఇంటిలోనే వర్కౌట్స్ చేస్తూ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: