స్క్రిప్ట్ లో ఆ రెండు పాయింట్స్ కచ్చితంగా చూసుకుంటా..!

Rashmika Mandanna reveals her two important factors she will consider for Selecting a script

అతి తక్కువ టైంలోనే రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. అయితే ఆ రేంజ్ కు ఎదగాలంటే కేవలం లక్ ఒక్కటే వుంటే సరిపోదు కదా. ఏ కథను ఎంచుకుంటున్నారు.. వాారి కథకు ఎంత ప్రాధాన్యత వుంది అనే విషయాలు కూడా చూసుకోవాలి. ఏదో నాలుగు సీన్స్, నాలుగు పాటలు ఉన్నాయా అని చూసుకుంటే సరిపోదు కదా. అలా చూసుకుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం కష్టం. ఆ విషయంలో రష్మిక మాత్రం డిఫరెంట్ అనే చెప్పొచ్చు. మొదటి సినిమా నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కథలను ఎంపిక చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ ఏ సినిమాకి ఆ సినిమాలో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంది కాబట్టే హిట్స్ తో పాటు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

ఇక రష్మిక కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే రెండు ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉండేలా చేసుకుంటుందట. ఇంతకీ ఆ రెండు విషయాలు ఏంటనుకుంటున్నారా..? ఏదైనా కథను వింటున్నప్పుడు తన పాత్ర ఎమోషన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉండాలట. దానితో పాటు ఎంటర్ టైన్ చేసేలా కూడా ఉండాలట. ఈ రెండు పాయింట్స్ మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకుంటదట రష్మిక. మరిస్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రతలు తీసుకుంటుంది కాబట్టే వరుస హిట్స్ తో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఇక రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తుంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో కూడా రష్మిక పాత్ర హైలైట్ అని ఇప్పటికే విన్నాం. దీనితో పాటు కన్నడలో “పొగరు “, తమిళ్ లో “సుల్తాన్” సినిమా చేస్తుంది. ఆ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here