ఈ రూమర్స్ ఎలా వస్తాయో అర్థంకావట్లేదు..!

Actress Payal Rajput Rubbishes Rumors Of Doing Special Songs In Pushpa and Indian 2 Movies

మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా తర్వాత “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఒక మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది ఈ భామ.

ఇక ఇదిలా ఉండగా ఇటీవల ఈ భామ పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘పుష్ప’లో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ 2” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా పాయల్ ఐటెం సాంగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవి కేవలం వార్తలు మాత్రమే అని తెలుస్తుంది. ఈ వార్తలలో నిజం లేదని పాయల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఈ రూమర్లు ఎవరో పుట్టిస్తున్నారో నాకు తెలియడం లేదు. నేనైతే ఏ చిత్రంలో సాంగ్స్ చేయడానికి అంగీకరించలేదు. సాంగ్స్ చేయాలంటూ నన్నెవరూ అప్రోచ్ అవ్వడం జరగలేదు. ఇండియన్ 2, పుష్ప వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారంటగా అని కొన్ని రోజులుగా నాకు ఒకటే మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సందర్భంగా అలా వినిపిస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని తెలియజేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఏ చిత్రానికి, సాంగ్‌కి సైన్ చేయలేదు. అలాగే ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనే అవకాశం కూడా లేదు. చిల్ అండ్ రిలాక్స్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇప్పటికైనా రూమర్స్ ఆగుతాయేమో చూద్దాం.

కాగా ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ప్రస్తుతం “నరేంద్ “, తమిళ్ లో “ఏంజెల్ ” సినిమాలో నటిస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here