మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్ ‘యముడికి మొగుడు’కి 32 ఏళ్ళు

Mega Star Chiranjeevi Socio Fantasy Movie Yamudiki Mogudu Completes 32 Years.

మెగాస్టార్ చిరంజీవికి సోషియో ఫాంటసీ మూవీస్ బాగా కలిసొచ్చాయి. ‘యముడికి మొగుడు’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. వీటిలో ‘యముడికి మొగుడు’కి ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే.. ‘పసివాడి ప్రాణం’(1987)లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మళ్ళీ చిరు కెరీర్‌లో అటువంటి విజ‌యాన్ని అందించింది ‘యముడికి మొగుడు’. అంతేకాదు.. చిరు తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన సోషియో – ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ కూడా ఇదే కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ధర్మాన్ని పాటించాల్సిన యమధర్మరాజు ఏమ‌రుపాటులో చిన్న త‌ప్పిదం చేస్తే ఎలా ఉంటుంది?”.. అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు ద‌ర్శ‌కుడు రవిరాజా పినిశెట్టి. ఇందులో చిరు ద్విపాత్రాభినయం పోషించగా రాధ, విజయశాంతి కథానాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ‘సుత్తి’ వేలు, రావుగోపాలరావు, ప్రసాద్‌బాబు, కోట శ్రీనివాసరావు, సుధాకర్, గొల్లపూడి మారుతీరావు, సూర్యకాంతం, హరిప్రసాద్, అన్నపూర్ణ ముఖ్య భూమికలు పోషించగా.. అంబిక ప్రత్యేక గీతంలో మెరిసింది.

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు రాజ్ – కోటి స్వరాలు సమకూర్చారు. “అందం హిందోళం”, “వాన ఝ‌ల్లు”, “కన్నెపిల్లతోటి”, “బహుశా”, “ఎక్కు బండెక్కు”, “నాట్యమిదా”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే. డైనమిక్ మూవీ మేకర్స్ పతాకంపై హ‌రిప్ర‌సాద్, సుధాకర్, నారాయణరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘అతిశయ పిరవి’(1990) పేరుతో రీమేక్ కావడం విశేషం. 1988 ఏప్రిల్ 29న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘యముడికి మొగుడు’.. నేటితో 32 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 19 =