హీరోయిన్ల‌ విషయంలో సేమ్ స్ట్రాట‌జీ ఫాలో అవుతున్న సుకుమార్

Sensational Director Sukumar Follows This Strategy In All His Movies

వైవిధ్యభ‌రితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఒక‌రు. మొదటి సినిమా ‘ఆర్య’ నుండి గత చిత్రం ‘రంగస్థలం’ వరకు నవ్యతకే పెద్దపీట వేశారాయన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ‘పుష్ప’ కూడా అదే బాటలో వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. సుకుమార్ సినిమాలను గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే.. ఆయన చిత్రాల‌న్నీ ‘సింగిల్ హీరోయిన్’ సబ్జెక్టులే కావడం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆర్య’(అను మెహతా), ‘జగడం’(ఇషా సహాని). ‘ఆర్య 2’(కాజల్ అగర్వాల్), ‘100% లవ్’(తమన్నా), ‘1:నేనొక్కడినే’(కృతి సనన్) ‘నాన్నకు ప్రేమతో’(రకుల్ ప్రీత్ సింగ్), ‘రంగస్థలం’(సమంత).. ఇలా సుక్కు గత చిత్రాలన్నీ సోలో హీరోయిన్ సినిమాలే. ఈ పరంపరలోనే ‘పుష్ప’లో కూడా రష్మికా మందన్న సోలో హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం.

మరి, రాబోయే చిత్రాల విష‌యంలోనూ సుక్కు ఇదే స్ట్రాట‌జీని కొనసాగిస్తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =