సార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం తను కూడా కుబేర షూటింగ్ లో పాల్గొంటుంది. ఈనేపథ్యంలో తాజాగా తన షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమాలోని ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈసినిమాతో పాటు రష్మిక పష్ప2 సినిమా కూడా చేస్తుంది. ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను కూడా చేస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో లేడి ఓరియెంటెడ్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: