టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘బీ ద రియల్‌మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పూర్తి చేయగా ఇప్పుడు మరొకరు రియల్ మెన్ జాబితాలో చేరారు. అతనెవరో కాదు డైరెక్టర్ కొరటాల శివ. జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కొరటాల శివ, వెంకటేష్, నాగార్జునలకి ఈ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఛాలెంజ్‌ని స్వీకరించిన కొరటాల.. తన ఛాలెంజ్ ను పూర్తి చేసి ట్విట్టర్ వీడియో ను పోస్ట్ చేసాడు. ఇప్పటికే నెల రోజు ఫూటేజ్ మిస్ అయిందని చమత్కరించారు. అంతే కాదు మొదట్లో కొంచం కష్టంగా వున్నా.. రాను రాను అలవాటయ్యి..ఇప్పుడు సరదా అయింది అని చమత్కరించాడు. అంతేకాదు విజయ్ దేవర కొండని తాను నామినేట్ చేస్తున్నాడు చెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here it is annayya @tarak9999.
మొదటోౢ కొంచెం కష్టంగా ఉన్నా, రాను రాను అలవాటయ్యి, ఇప్పుడు సరదా అయింది. #BeTheREALMAN
I now nominate @TheDeverakonda for this challenge. pic.twitter.com/QSxMDbBR11
— koratala siva (@sivakoratala) April 22, 2020
మరి ఎన్టీఆర్ చెప్పిన లిస్ట్ లో అగ్ర హీరోలు ఉన్నారు.. చిరు అయితే తన సినిమా ఛాలెంజ్ సినిమా ను పెట్టి మరి ఛాలెంజ్ ను స్వీకరించాడు. మరి మిగిలిన హీరోల పరిస్థితి ఏంటో.. చూద్దాం. కాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన సంగతి విదితమే.




ఇక ప్రస్తుతం కొరటాల చిరు తో ఆచార్య సినిమా చేస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు రద్దవడంతో ఇంట్లో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటూ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: