యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘మున్నా(2007), ‘మిస్టర్ పర్ ఫెక్ట్’(2011) వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. కాగా… త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… ఈ సినిమాకి ‘సైరా నరసింహారెడ్డి’తో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడని టాక్. స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఓ కథను సిధ్ధం చేసాడట సురేందర్ రెడ్డి. ఆ కథ ప్రభాస్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని ఇన్ సైడ్ టాక్. మరి… ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం ప్రభాస్… ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: