గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమాలో షాహిద్ క్రికెటర్ గా కనిపించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తన లుక్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు షాహిద్ కపూర్.
ఇక ఈ రీమేక్ ను తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. అంతేకాదు 2020 ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానున్నట్టు కూడా అప్పుడే వార్తలు వస్తున్నాయి. మరి అర్జున్ రెడ్డి రీమేక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన జెర్సీ తో కూడా కొడతాడమేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: