వేస‌విలో ప్రారంభం కానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ చిత్రం?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో విజ‌య్ ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు… 2020 వేస‌వి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిసింది. వైజాగ్‌, హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం… శివ నిర్వాణ ప్రీవియ‌స్ మూవీస్ `నిన్ను కోరి`, `మ‌జిలీ` త‌ర‌హాలో ఎమోష‌నల్ సాగుతుంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆ త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్‌`, ఆనంద్ అన్నామ‌లై డైరెక్ష‌న్‌లో మ‌ల్టీలింగ్వ‌ల్‌ మూవీ `హీరో`ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఆ త‌రువాతే శివ నిర్వాణ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. మ‌రి… క్రేజీ లైన‌ప్‌తో ముందుకు సాగుతున్న విజ‌య్‌… ఆ యా చిత్రాల‌తో మంచి విజ‌యాలు అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =