దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత… తెలుగునాట సిసలైన మల్టీస్టారర్ మూవీ వస్తోంది. అదే… `ఆర్ ఆర్ ఆర్`. ఒకే తరానికి చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు (యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్) కలసి నటిస్తున్న ఈ మాసివ్ మల్టీస్టారర్‌ని దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 జూలై 30న రాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే సినిమాలో నటిస్తున్నప్పుడు వారి పరిచయ సన్నివేశాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉండడం సహజం. అందునా… జక్కన్న లాంటి అగ్రశ్రేణి దర్శకుడు, అందునా మాస్ పల్స్ తెలిసిన నిర్దేశకుడు… ఈ ఎంట్రీ సీన్స్‌ని ఎలా డిజైన్ చేసి ఉంటాడన్న క్యూరియాసిటీ తప్పక ఉంటుంది. అందుకే ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ పరిచయ సన్నివేశాలను డిజైన్ చేశాడని ఇన్‌సైడ్ టాక్.
వినిపిస్తున్న కథనాల ప్రకారం… పులితో పోరాడే ఘట్టంతో తారక్ ఎంట్రీ సీన్ ఉంటే, వందమందితో పోరాడి గెలిచే వీరుడిగా చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందట. అంతేకాదు… ఈ సన్నివేశాల కోసం జక్కన్న భారీమొత్తాన్నే వెచ్చించారట. మరి… ఈ సన్నివేశాలు వెండితెరపై ఏ స్థాయిలో రంజింపజేస్తాయో తెలియాలంటే జూలై 30 వరకు వేచిచూడాల్సిందే.
పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్`లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: