భారతీయ సంస్కృతిలో వివాహవ్యవస్థకున్న పవిత్రతను ఆవిష్కరించిన చిత్రం ‘పవిత్ర బంధం’. ‘విక్టరీ’ వెంకటేష్, `అభినేత్రి` సౌందర్య జంటగా నటించగా… కుటుంబకథా చిత్రాల దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి.వెంకట్‌రాజు, జి.శివరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో… గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ‘శుభలేఖ’ సుధాకర్, శ్రీహరి, ప్రకాష్‌రాజ్, సుధాకర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుత్తి వేలు, అన్నపూర్ణ, రాగిణి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భూపతి రాజా కథకి పోసాని కృష్ణమురళి అందించిన సంభాషణలు సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత రచన చేయగా… స్వరవాణి కీరవాణి స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకులను రంజింపజేశాయి. “మాయదారి మాయదారి”, “ఐసాలకిడి” వంటి పాటలతో పాటు… భార్య గొప్పతనాన్ని చాటి చెప్పే “అపురూపమైనదమ్మ” గీతం హృదయాలను తాకుతుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి(సౌందర్య), ఉత్తమ సహాయనటుడు(బాలసుబ్రహ్మణ్యం) విభాగాల్లో “నంది” పురస్కారాలను కైవసం చేసుకున్న `పవిత్ర బంధం`… ఒరియా(‘సుహాగ్ సింధూర’), కన్నడం(‘మాంగల్యంతంతునానేనా’), హిందీ(‘హమ్ ఆప్ కే దిల్ మే రెహెతే హైన్’), బంగ్లాదేశ్ బెంగాలీ(‘ఎ బదొన్ జబీనాచ్చిరే’), తమిళం(‘ప్రియమనవలె’), బెంగాలీ(‘సాత్ పాకే బందా’) వంటి ఆరు భాషల్లో పునర్నిర్మించబడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. 1996 అక్టోబర్ 17న విడుదలై ఘనవిజయం సాధించిన ‘పవిత్ర బంధం’… నేటితో 23 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: