ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్… అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐదేళ్ళ క్రితం విడుదలైన `అల్లుడు శీను`తో హీరోగా తొలి అడుగులు వేసిన ఈ యంగ్ హీరో… ఇప్పటివరకు ఐదు చిత్రాలతో సందడి చేశాడు. ఇప్పుడు ఆరో చిత్రం `సీత` విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహించాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా వేసవి సందర్భంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… సాయిశ్రీనివాస్ నటించిన సినిమా ఏదీ ఇప్పటివరకు సమ్మర్ సీజన్‌లో విడుదల కానేలేదు. `సీత`తోనే తొలిసారిగా వేసవి బరిలో దిగుతున్నాడు ఈ డాన్సింగ్ స్టార్. మరి… గతంలో పలువురు యువ కథానాయలకు `తొలి వేసవి` ప్రయత్నాలు బాగా కలిసొచ్చిన వైనం… సాయిశ్రీనివాస్‌కి కూడా కొనసాగుతుందేమో చూడాలి.
[youtube_video videoid=1eQHokIL9wA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: