యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా పరిచయమై ఈ ఏడాదితో పదేళ్ళు పూర్తవుతోంది. ఈ దశాబ్ద కాలంలో ఇప్పటివరకు హీరోగా 16 (అతిథి పాత్రలతో కలుపుకుంటే 21) చిత్రాలతో సందడి చేశాడు. ఇప్పుడు 17వ చిత్రమైన `మజిలీ` వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… సమ్మర్ సీజన్‌లో రిలీజైన నాగచైతన్య చిత్రాలు సింహభాగం విజయం సాధించాయి. ఇప్పటివరకు `100% లవ్` (2011), తడాఖా (2013), మనం (2014), దోచేయ్ (2015), రారండోయ్ వేడుక చూద్దాం (2017) సినిమాలతో వేసవిలో సందడి చేసిన చైతూకి… `దోచేయ్` మినహాయిస్తే మిగిలినవన్నీ మంచి విజయాలను అందించిన చిత్రాలే. ఈ నేపథ్యంలో… `మజిలీ` కూడా అదే బాటలో వెళుతుందేమో చూడాలి.
`మజిలీ`లో నాగచైతన్యకి జోడీగా తన శ్రీమతి సమంత నటించగా… `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.
[youtube_video videoid=jNZPdlUP7cc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: