‘హీరో’ పక్కన హీరోయిన్ ఫిక్స్

Heroine Fixed For Vijay Deverakonda New Movie,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Next Film News,Actor Vijay Deverakonda Next Project Details
Heroine Fixed For Vijay Deverakonda New Movie

‘పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’ ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా.. ఒక సినిమా సెట్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో బిజీగా ఉన్న విజయ్‌ క్రాంతి మాధవ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు తాజాగా తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు విజయ్‌. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అఫీషియల్ కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మాళవిక మోహనన్. రీసెంట్ గా వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘పేట’ సినిమాలో కూడా ఈమె నటించింది. ఇప్పుడు తెలుగులో విజయ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపిస్తుండగా.. ఆమె మ్యుజీషియన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

కాగా హీరో అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌(సీవీఎం) నిర్మించనున్నారు. ఏప్రిల్‌ 22న షూటింగ్‌ ఆరంభం కానుంది.

[subscribe]

[youtube_video videoid=C4ofndzFciI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =