`అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అక్కినేని అఖిల్… తన తదుపరి సినిమాని `బొమ్మరిల్లు` భాస్కర్ కాంబినేషన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా `టాక్సీవాలా` ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ నటించే అవకాశముందని టాలీవుడ్ టాక్. అనంతపూర్ జిల్లాలో పుట్టిన ప్రియాంక… తన తొలి చిత్రం `టాక్సీవాలా`తోనే మంచి విజయం నమోదు చేసుకుంది. ఇప్పుడు అఖిల్ – భాస్కర్ కాంబినేషన్ మూవీలోనూ ఎంపికై… మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలోనే ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ రావచ్చు.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: