కొన్ని కొన్ని సినిమాలకు వాటి కాంబినేషన్స్ బట్టే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అయితే అది ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది. ఒక్కోసారి వర్కవుట్ అవ్వదు. అలా ఈమధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయి బోల్తా కొట్టిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీ లోకి కూడా రాబోతుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 26వ తేదీన ఈసినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈసినిమా రిలీజ్ అయి కనీసం నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రావడం విశేషం.
కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ సినిమాలో గోవర్ధన్ అనే మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. అతని జీవితంలోకి ఇందు ఎలా వచ్చింది? ఇందును ప్రేమించిన గోవర్ధన్ ఆమెకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? జాబ్ కోసం గోవర్ధన్ అమెరికా వెళ్లగా అతడి వెంట ఇందు ఎందుకు వచ్చింది? చివరికి గోవర్ధన్, ఇందు ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: