మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. వాటిలో `కథానాయకుడు` ఒకటి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి కె.హేమంబరధరరావు దర్శకత్వం వహించారు. గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో యన్టీఆర్‌కి జోడీగా జయలలిత నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో నాగభూషణం, చిత్తూరు వి.నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు తదితరులు నటించారు. టి.వి.రాజు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా… `ముత్యాల జల్లు కురిసే`, `మంచివాడు మా బాబాయి`, `ఇంతేనయా తెలుసుకోవయా`, `వినవయ్యా రామయ్య` గీతాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఫిబ్రవరి 27, 1969న విడుదలైన `కథానాయకుడు`… నేటితో 50 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`కథానాయకుడు` – కొన్ని విశేషాలు:
* రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన యన్టీఆర్, జయలలిత… తదనంతర కాలంలో ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేయడం విశేషం.
* తమిళంలో `నమ్ నాడు` (యం.జి.ఆర్, జయలలిత) పేరుతోనూ, హిందీలో `అపనా దేశ్` (రాజేష్ ఖన్నా, ముంతాజ్) పేరుతోనూ రీమేక్ అయిన ఈ చిత్రం… రెండు చోట్లా విజయఢంకా మోగించింది.
* 1969కి గానూ `ఉత్తమ చిత్రం`గా `బంగారు నంది`ని అందుకుందీ చిత్రం.
[youtube_video videoid=jUxnrFUYzBA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: