ఇప్పుడు ప్రశ్నించే టైమ్ నాది అంటుంది బాలీవుడు క్వీన్ కంగనా రనౌత్. ఇంతకీ ఏం ప్రశ్నిస్తుంది…? ఎవరిని ప్రశ్నిస్తుందనే కదా డౌట్. ఇంకెవర్నీ డైరెక్టర్ క్రిష్ ను. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు ఎందుకో సైలెంట్ గా ఉన్నా క్రిష్ సినిమా రిలీజ్ అయిన తరువాత.. ఈ సినిమాకు తానే 70 శాతం షూటింగ్ చేశానని.. సినిమాలో నేను చేసిందే ఉందని చెప్పడంతో ఈ సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఆ తరువాత కొంత మంది క్రిష్ కు మద్దతు పలుకగా మరి కొంత మంది కంగనాకు మద్దతు పలికారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఏదైనా వార్త గురించి ఎన్ని రోజులు చర్చించుకుంటారు. అలాగే ఈ వివాదం గురించి కూడా కొన్ని రోజులు వాడి వేడిగా చర్చలు జరిగినా.. ఆతరువాత అందరూ కామ్ అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కంగనా ఈ వివాదాన్ని తట్టి లేపింది. దానికి కారణం ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. వాటికి, కంగనాకు సంబంధం ఏంటనుకుంటున్నారా? ఆసినిమాతో కాదు… ఆసినిమా తీసిన క్రిష్ తోనే కంగనాకు పని.
అసలు సంగతేంటంటే.. ఈ రెండు చిత్రాలకి డివైడ్ టాక్ రాగా, ఈ విషయంపై కంగనాని ఓ మీడియా ప్రశ్నించగా.. దానిపై స్పందించిన ఈ భామ క్రిష్ పై ఉన్న ఆగ్రహాన్ని మరోసారి చూపించింది.
రెండు పార్టులుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర జీరో రికవరీగా నిలిచాయని నేను విన్నాను. బాలకృష్ణ జీవితంలో అవి ఓ మచ్చగా మిగిలిపోతాయి. క్రిష్‌ని నమ్మిన బాలకృష్ణని చూస్తుంటే బాధగా ఉంది. ఇప్పుడు ప్రశ్నించే టైమ్ నాకు వచ్చింది. నా వ్యక్తిత్వంపై దాడి చేయడమే కాకుండా, నిందలు వేస్తూ రాబందుల్లా పీక్కు తిన్నవారు, తప్పుడు ఆరోపణలు చేసిన వారు ఇప్పుడేమంటారు అని కంగనా ప్రశ్నించింది. క్రిష్‌కి మంచి సినిమాలు తీసే సత్తా ఉంటే కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల పరిస్థితి ఇలా ఎందుకైందని ప్రశ్నించింది. క్రిష్, కొన్ని పెయిడ్ సంస్థలు నా చిత్రంపై బురదజల్లాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై క్రిష్ ఎలా స్పందిస్తాడో చూద్దాం..
[youtube_video videoid=HlG50ZHr4oE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: