తన “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సంగతి కాసేపు పక్కన పెట్టి రేపు రిలీజ్ అవుతున్న” ఎన్టీఆర్- మహా నాయకుడు” మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నట్లున్నారు ” వివాద విహారి” రాంగోపాల్ వర్మ. బాలయ్య కన్నా, ఆయన అభిమానుల కన్నా, తెలుగుదేశం వర్గాల కన్నా ” ఎన్టీఆర్-మహానాయకుడు ” ఎలా ఉంటుంది అనే ఉత్సుకత రాంగోపాల్ వర్మ లోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఉంది వర్మ ట్వీట్స్ వార్ చూస్తుంటే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రకరకాల ట్వీట్స్ తో అందరినీ టీజ్ చేసే రాంగోపాల్ వర్మ ఈరోజు “ఎన్టీఆర్ మహానాయకుడు”లో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించిన దగ్గుపాటి రానా ఫోటోను టాగ్ చేస్తూ “రానా నువ్వు ఒరిజినల్ కంటే ఒరిజినల్ గా ఉన్నావు”- అని ట్వీట్ చేశాడు. అంటే నువ్వు పోషించిన చంద్రబాబు నాయుడు పాత్రలో ఒరిజినల్ చంద్రబాబునాయుడు కంటే నువ్వే ఒరిజినల్ గా ఉన్నావు అనే అర్థం వచ్చేలాగా సెటైర్ విసిరాడు. నిజానికి ఈ సరసానికి రానా కూడా సరైన రీతిలో స్పందించేవాడే…కానీ అవతల ఉన్నది “వివాద ప్రియుడు” రాంగోపాల్ వర్మ కావటంతో దీనిని కూడా మరొక పబ్లిసిటీ స్కీం కింద వాడేసుకుంటాడన్న భయంతో సింపుల్ గా ” థాంక్యూ” అని సమాధానం ఇచ్చాడు. నిజానికి వెటకారం కాకపోతే ఒరిజినల్ కంటే ఒరిజినల్ గా ఉండటం అంటే ఏమిటి? అంటే చంద్రబాబు నాయుడు కంటే దగ్గుపాటి రానా లొనే ఒరిజినాలిటీ ఉంది అని అర్థమా? ఏది ఏమైనా ఎన్టీఆర్ కథానాయకుడు రిజల్ట్ నేపథ్యంలో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని చాలా లో ప్రొఫైల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే దీనికి తన ట్వీట్ల ద్వారా రాంగోపాల్ వర్మ ఆశించని పబ్లిసిటీని కల్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే రేపు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ మహా నాయకుడు రివ్యూలను, రిజల్ట్ ను చూసుకున్న తర్వాత తన “లక్ష్మీస్ ఎన్టీఆర్” లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే ఉద్దేశంలో రాంగోపాల్ వర్మ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి తనను తాను వివాదాల్లో ఇరికించుకోవటంలోనే కాదు … ఇతరులను ఇరికించటంలో కూడా “మాస్టర్స్” చేశారు రాంగోపాల్ వర్మ. తన గత చిత్రాల కంటే “లక్ష్మీస్ ఎన్టీఆర్” విషయంలో ఈ వివాద విద్యను బాగా ప్రదర్శిస్తున్నారు The Champion of controversy Ram Gopal Varma.
Hey @RanaDaggubati ..U are KILLING IT ..U are looking more original than original🙏🙏🙏 pic.twitter.com/lyXrWQsNpC
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2019
[youtube_video videoid=4_n-yoBLrB0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: