సాయి శ్రీనిపాస్ కొత్త సినిమా ప్రారంభం

సినిమా ఫ్లాప్, హిట్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఒక సినిమా షూటింగ్ లో ఉంటూనే మరో సినిమాను ప్రారంభించేస్తున్నాడు. ప్రస్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో `సీత‌` అనే సినిమాతో బిజీగా ఉన్నాడు సాయి. వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇది కాక `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమాలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాటితో పాటు త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `రాచ్చ‌స‌న్‌` సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈసినిమాను ఈరోజు లాంచనంగా ప్రారంభించారు. నేటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

కాగా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్ బ్యానర్ పై హావిష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈసినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా రాశి ఖన్నా దాదాపుగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే రాశి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=vrPywmq0XQU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =