ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇందుకు… టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కూడా మినహాయింపు కాదు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో కలుపుకుని మొత్తం తొమ్మిది సినిమాలను రూపొందించిన విక్రమ్… ప్రస్తుతం నానితో తన పదో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమాలో… తనకు సంబంధించిన ఓ సెంటిమెంట్‌ని మరోసారి రిపీట్ చేస్తున్నాడు విక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… తన చిత్రాల్లో ఎక్కువగా కనిపించే సీనియర్ హీరోయిన్ శరణ్యని ఈ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటింపజేస్తున్నాడు విక్రమ్. తమిళ చిత్రాలు `అలై`, `యావరుమ్ నలమ్`తో పాటు `మనం`, `24` చిత్రాల్లోనూ శరణ్య ముఖ్య భూమికలు పోషించింది. వీటిలో `అలై` మినహా మిగిలిన చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో… నాని24 కూడా అదే బాటలో వెళుతుందేమో చూడాలి.
`నాయకుడు`, `నీరాజనం` వంటి చిత్రాల్లో కథానాయికగా అలరించిన శరణ్య… గత కొంతకాలంగా తల్లి పాత్రల్లో దర్శనమిస్తోంది. మరి… ఈ సినిమాలోనూ నానికి తల్లిగా నటిస్తుందో లేదంటే కథానాయికకు తల్లిగా నటిస్తుందో చూడాలి.
[youtube_video videoid=bjl-gISLXzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: