పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటించే ఒక హీరోయిన్ నిథి అగర్వాల్ ను ఎంపిక చేయగా..తాజాగా మరో హీరోయిన్ ను ప్రకటించారు. మరో హీరోయిన్ గా నభానటేష్ ను ఎంపిక చేసినట్టు ఛార్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో నభా పక్కా హైదరాబాదీ అమ్మాయి పాత్రో కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరి తొలి సినిమా నన్ను దోచుకుందువటే లో నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న నభా ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Kirraaak Hyderabadi pori @nabhanatesh in #ismartshankar 😉@purijagan @ramsayz @PuriConnects #PCfilm pic.twitter.com/kKsmGkYGpe
— Charmme Kaur (@Charmmeofficial) January 31, 2019
కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: