రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నసినిమా సినిమా దేవ్. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా యూ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా… తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కార్తి అన్న సూర్య ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో నిక్కీ గిర్లానీ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతం అందించాడు.
[youtube_video videoid=dqi6ofDtMYc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: