వివాహ బంధంతో ఒక్కటవుతున్న స్టార్స్

Tamil Hero Aarya To Marry Sayyeshaa Soon,Another Heart throb Ties The Knot This Season,Arya To Tie Knot with Sayyeshaa,Arya And Sayyeshaa Latest News,Hero Arya To Marry Actress Sayyeshaa,Sayyeshaa Saigal And Arya To Marry In March,Arya Marriage with Sayyeshaa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actor Arya and Actress Sayyeshaa to Tie Knots Soon
Another Heart throb Ties The Knot This Season

గత ఏడాది సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా ల పెళ్లిళ్లతో సందడిగా గడిపోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు స్టార్స్ వివాహబంధంతో ఒకటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సయేషా సైగల్, వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో ఆర్య‌. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం. మార్చి 9, 10 తేదీల‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని.. హైద‌రాబాద్‌లో ఆర్య‌, స‌యేషాల పెళ్లి వేడుక జ‌ర‌ప‌నుండ‌గా, చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. ఈ చిత్రం ద్వారా ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక ఇరు కుటుంబాల సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్ద‌రు పెళ్లి బంధంతో ఒక్క‌టి కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా హిందీలో శివాయ్ అనే చిత్రంతో ఆరంగేట్రం చేసిన స‌యేషా ప్ర‌ముఖ న‌టులు సుమీత్ సైగల్ మరియు షాహీన్‌ల కూతురు కాగా, దిలీప్ కుమార్, సైరా భానుల మ‌న‌వ‌రాలు అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో వీరిద్దరూ న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=7B9bBrKEWvA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.