
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 258


సైంధవ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మంచి మనసు చాటుకున్న చైతు

అజిత్ గారితో సినిమా కోసం వెయిటింగ్

సలార్- మైత్రీ చేతిలో నైజాం రైట్స్

యానిమల్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన రష్మిక

కంగువా లో హైలెట్ గా ఆరు ఫైట్లు

కోహ్లీ వరల్డ్ రికార్డ్ పై సెలబ్రిటీల రియాక్షన్

సలార్ ఏపీ రిలీజ్ వివరాలు

అథర్వ ట్రైలర్ రిలీజ్

ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం అదే - సింగర్ సునీత
టాలీవుడ్ గాయనీమణుల్లో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకోగలిగిన అతికొద్దిమందిలో సింగర్ సునీత ఉపద్రష్ట ఒకరు. కేవలం గాయకురాలిగానే కాకుండా.. ఎన్నో సినిమాల్లో కథానాయికలకు తన గాత్రాన్ని అరువిచ్చారు. ఒక గాయకురాలిగా సునీతను మూవీ లవర్స్ ఎంతగా అభిమానిస్తారో.. సినిమాల్లో ఆమె చెప్పే డబ్బింగ్‌ని కూడా అంతే అభిమానిస్తారు. ఇక సునీత డబ్బింగ్‌కి సాధారణ ప్రేక్షకులే కాదు, పేరొందిన డైరెక్టర్స్ సైతం ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. దీనికితోడు దేశ, విదేశాల్లో కొన్ని వేల షోలు చేసిన అనుభవం ఆమె సొంతం.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఎమోషలన్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సైంధవ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మంచి మనసు చాటుకున్న చైతు
మన హీరోలు రీల్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము చేసే పనుల వల్ల హీరోలనిపించుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు..ఎంతోమందికి హెల్ప్ చేస్తూ తమ ఉదారతను చాటుతూనే ఉంటారు. ఇక తాజాగా నాగ చైతన్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. హైద్రాబాద్ లోని సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో నాగచైతన్య కాసేపు గడిపారు. అక్కడ వారితో కాసేపు సరదాగా ఆటలు ఆడి పిల్లలను సంతోషపరిచారు. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక చైతు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

సుమంత్ కొత్త చిత్రం.. మహేంద్రగిరి వారాహి ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ హీరో సుమంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు అయింది. మీనాక్షి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరును ఫిక్స్ చేశారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. అంతకుముందు చిత్రబృందం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర…

రివ్యూ : మంగళవారం
ఓవరాల్ గా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈమంగళవారంలో పాయల్ రాజ్ పుత్ నటన,ట్విస్టులు ,నేపథ్య సంగీతం,డైరెక్షన్ హైలైట్ అయ్యాయి.థియేటర్లలో మంగళవారం సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.థ్రిల్లర్లను ఇష్టపడేవారికి మంగళవారం మంచి ఆప్షన్ కానుంది.

అజిత్ గారితో సినిమా కోసం వెయిటింగ్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ. తమిళ్ లో వరుసగా హిట్లతో దూసుకుపోతున్న అట్లీ జవాన్ తో దేశవ్యాప్తంగా తన సత్తాను చాటాడు. షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా ఏ రకంగా సంచలనాలు సృష్టిస్తుందో చూశాం. ప్రస్తుతం అయితే అట్లీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు.

సలార్- మైత్రీ చేతిలో నైజాం రైట్స్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

కోహ్లీ బయోపిక్.. హీరోగా అతడే పర్‌ఫెక్ట్ - రణ్‌బీర్ కపూర్ కామెంట్స్ వైరల్
ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో 70 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఒడిసి పట్టుకునేందుకు టీమ్ ఇండియా మరొక్క అడుగు దూరంలో నిలిచింది. దీనికితోడు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. తద్వారా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా కోహ్లీకి ఇది 50వ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ రికార్డు తర్వాత కోహ్లీ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

యానిమల్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన రష్మిక
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను అలానే వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

మంగళవారం రిలీజ్‌కు ముందు ఫ్యాన్స్‌కి ట్రీట్.. మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో అజయ్ భూపతి ఒకరు. తొలి ప్రయత్నంలోనే 'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా 'మహాసముద్రం' అనే సినిమాను రూపొందించగా.. అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా, ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. కాగా అజయ్ భూపతి ప్రస్తుతం మూడో సినిమాగా 'మంగళవారం' అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కంగువా లో హైలెట్ గా ఆరు ఫైట్లు
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. చెన్నైలో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

జిగర్ తండ డబల్ ఎక్స్ పై నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈసినిమా జిగర్ తండ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే తమిళ్ లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

పేద విద్యార్థులకు అండగా.. గొప్ప మనస్సు చాటుకున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ గారి తొలి వర్ధంతి (నవంబర్ 15, 2023) సందర్భంగా.. ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాలలోని పలువురు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు తెలిపారు. ఇక తాము నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమానికి…

కోహ్లీ వరల్డ్ రికార్డ్ పై సెలబ్రిటీల రియాక్షన్
నిన్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో భాగంగా కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. నిన్న సెమీ ఫైనల్స్ లో భాగంగా న్యూజిలాండ్ కు అలానే ఇండియాకు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ 50వ శతకం సాధించాడు. అంతేకాదు లెజెండ్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టి తన పేరుతో వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా అందరూ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సలార్ ఏపీ రిలీజ్ వివరాలు
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

అథర్వ ట్రైలర్ రిలీజ్
అన్ని వర్గాల వారికి ఇష్టమైన జోనర్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈమధ్య కాలంలో ఆ జోనర్ లలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇదే జోనర్ లో మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి.. మహేష్ బాబు, నమ్రత ఘన నివాళులు
దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తొలి వర్ధంతి నేడు (నవంబర్ 15, 2023). ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహేష్, నమ్రతలు కృష్ణ, ఇందిరా దేవి దంపతుల ఫోటోల వద్ద పువ్వులు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం వారి పిల్లలు గౌతమ్ మరియు సితార ఇరువురూ తమ తాతకు నమస్కరించి అంజలి ఘటించారు. కాగా ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "సూపర్ స్టార్ ఆల్వేస్ అండ్ ఫరెవర్" అని…

ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ వల్ల రిలీజ్ డేట్ మార్చారు. ఫైనల్లీ నవంబర్ 24వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను…

వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌తో వెంకటేష్ సెల్ఫీ
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ స్వతహాగా నటుడైనప్పటికీ.. ఆయనకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. అందునా ముఖ్యంగా క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఆయనకు. అందుకే భారత్ జట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కోసారి ఇతర దేశాలకు సైతం వెళ్లి మరీ మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టోర్నీ ప్రస్తుతం లీగ్ దశ పూర్తయ్యి కీలకమైన నాకౌట్ స్టేజ్‌కి చేరుకుంది. ఇక ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లలో అదరగొట్టిన భారత్ నాకౌట్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. దీనిలో భాగంగా…