నటీనటులు : పాయల్ రాజ్ పుత్,నందితా శ్వేత,అజయ్ ఘోష్,కృష్ణ చైతన్య
ఎడిటింగ్ :మాధవ్ కుమార్
సినిమాటోగ్రఫీ :దాశరథి శివేంద్ర
సంగీతం : అజనీష్ లోక్ నాథ్
దర్శకత్వం :అజయ్ భూపతి
నిర్మాతలు :స్వాతి గుణాపాటి,సురేష్ వర్మ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పోస్టర్లు,ట్రైలర్ తో హైప్ క్రీయేట్ చేసిన చిత్రం మంగళవారం.వీటికి తోడు ఈసినిమాను ఆర్ ఎక్స్ 100ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేయడం అలాగే పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా నటించడంతో సినిమాను చూడాలి అన్న ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది.సినిమా మీద నమ్మకంతో నిన్నపెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు.ఇక ఈసినిమా ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా అంచనాలను అందుకుందా? ఇంతకీ మంగళవారం ఏం జరిగింది దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.
కథ :
మహా లక్ష్మిపురం అనే గ్రామం.మంగళవారం రోజున ఆ ఊరిలో అక్రమ సంబంధం పెట్టుకున్న జంట హత్యకు గురైతుంది.మరో మంగళవారం మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది.అక్రమ సంబంధం పెట్టుకున్న మరో జంట చనిపోతుంది.ఈ హత్యలు జరిగే ముందు ఎవరో గోడ మీద వారి పేర్లను రాయడం ఆ తరువాత ఆ జంటలు హత్యకు గురికావడం జరుగుతుంది.ఈ మిస్టరీ ని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ నందితా శ్వేత రంగంలో దిగుతుంది.ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తారు.శిరీష (పాయల్ రాజ్ పుత్)కు ఈ హత్యలకు సంబంధం ఏంటి ? ఇంతకీ శిరీష ఎవరు? ఆమె గతం ఏంటి అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
కథగా చూస్తే చాలా చిన్నదే కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానాన్ని అభినందించాల్సిందే. కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నా ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా డీసెంట్ గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ స్టార్ట్ అవుతుంది అక్కడి నుండి తన ట్యాలెంట్ చూపించాడు దర్శకుడు.ముఖ్యంగా చివరి 30నిమిషాలు సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.ట్విస్టులు సరికొత్త అనుభూతిని పంచుతాయి.
వీటికి తోడు పాయల్ రాజ్ పుత్ నటన హైలైట్ అవ్వగా సౌండ్ మిక్సింగ్ సినిమాకు ప్రాణం పోసింది.చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.ముఖ్యంగా ప్రీ క్లైమ్యాక్స్ ,క్లైమ్యాక్స్ మెప్పిస్తుంది.ఓవరాల్ గా మంగళవారం సరికొత్త అనుభూతిని పంచుతుంది.ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించేలా సాగగా సినిమాకు కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే శైలజ పాత్రలో పాయల్ నటన చాలా బాగుంది.ఈపాత్ర ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి కేవలం గ్లామర్ గా కనబడడం మాత్రమే కాదు నటన పరంగా కూడా పాయల్ ఆకట్టుకుంది.కథంతా తన చుట్టే తిరగడంతో తనకు పెర్ఫామెన్స్ చేయటానికి చాలా స్కోప్డ్ దొరికింది.ఈపాత్ర తరువాత సినిమాలో అజయ్ ఘోష్ పాత్ర హైలైట్ అయ్యింది.తన కామెడీ తో చాలా చోట్ల రిలీఫ్ ఇచ్చాడు.నందితా శ్వేత,అజ్మల్,కృష్ణ చైతన్య,దివ్య పిళ్ళై వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.
టెక్నీకల్ గా సినిమా ఉన్నతంగా వుంది.దర్శకుడు అజయ్ భూపతి తన చెప్పాలనుకున్నా పాయింట్ ను ఎంగేజింగ్ చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.ముఖ్యంగా కథను నరేట్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది.ఇక సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది నేపథ్య సంగీతం.కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందించాడు.పాటలు పక్కన పడితే నేపథ్య సంగీతం వావ్ అనిపించింది.ఎడిటింగ్ షార్ప్ గా వుంది.దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ సినిమాకు అసెట్.విజువల్స్ రిచ్ గా వున్నాయి.నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు చేశారు.నిర్మాతల్లో ఒకరైన స్వాతి గుణాపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితురాలు.తన మొదటి సినిమాను ఎక్కడా రాజీపడకుండా చాలా క్వాలీటితో నిర్మించారు.
ఓవరాల్ గా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈమంగళవారంలో పాయల్ రాజ్ పుత్ నటన,ట్విస్టులు ,నేపథ్య సంగీతం,డైరెక్షన్ హైలైట్ అయ్యాయి.థియేటర్లలో మంగళవారం సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.థ్రిల్లర్లను ఇష్టపడేవారికి మంగళవారం మంచి ఆప్షన్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: