తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈసినిమా జిగర్ తండ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే తమిళ్ లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు చిన్నగా పాజిటివ్ బజ్ పెరుగుతుంది. ఇప్పటికే తలైవా రజనీకాంత్ ఈసినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని కూడా ఈసినిమాపై స్పందించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. తాజాగా నాని తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ జిగర్ తండ డబల్ ఎక్స్ గురించి ఆసక్తిరమైన విషయాలు వింటున్నా.. ఎంతోకాలంగా ఎదురుచూసిన సమయం ఇది.. ఇంత ఆదరణకు నువ్వు అర్హుడవే కార్తీక్ అంటూ ఈసినిమాలో నటించిన లారెన్స్, ఎస్ జే సూర్య, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కు కంగ్రాట్స్.. సినిమా చూడటానికి వెయిట్ చేయలేను అంటూ తెలిపారు.
Hearing amazing things about #JigarthandaaXX . This was long over due dear @karthiksubbaraj . Your craftsmanship always deserved this love. Congratulations @iam_SJSuryah sir. @offl_Lawrence sir. @Music_Santhosh sir.
Can’t wait to watch 🤗— Nani (@NameisNani) November 16, 2023
కాగా ఈసినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇంకానవీన్ చంద్ర, నిమిష సజయన్, షైన్ టామ్ చాకో, ఇలవరసు తదితరులు నటించారు. కార్తికేయన్ సంతానం, కదిరేశన్
నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ ఈసినిమాకు సంగీతం అందించగా.. తిరు సినిమాటోగ్రాఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: