టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ స్వతహాగా నటుడైనప్పటికీ.. ఆయనకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. అందునా ముఖ్యంగా క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఆయనకు. అందుకే భారత్ జట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కోసారి ఇతర దేశాలకు సైతం వెళ్లి మరీ మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టోర్నీ ప్రస్తుతం లీగ్ దశ పూర్తయ్యి కీలకమైన నాకౌట్ స్టేజ్‌కి చేరుకుంది. ఇక ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లలో అదరగొట్టిన భారత్ నాకౌట్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. దీనిలో భాగంగా ఈరోజు జరుగుతోన్న తొలి సెమీఫైనల్‌లో పటిష్ట న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నేడు ముంబై లోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో హీరో వెంకటేష్ ముంబై చేరుకున్నారు. భారత జట్టుకి మద్దతుగా స్టేడియంలో వెంకటేష్ ఇండియన్ ఫ్లాగ్ చేపట్టి సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాన్ని కలుసుకున్నారు. తొలి మూడు ప్రపంచ కప్‌లలో ఆడిన లెజెండరీ ఆటగాడు వివ్ రిచర్డ్స్‌తో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం దీనిని తన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయగా.. అది నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వివ్ రిచర్డ్స్ 1970-80లలో నెం.1 ఆటగాడిగా గుర్తింపు పొందారు. మొదటి రెండు ప్రపంచ కప్‌లను (1975, 1979) వెస్టిండీస్ గెలుచుకోగా.. అందులో రిచర్డ్స్ కీలక పాత్రను పోషించారు.
Delighted to be with the legendary Viv Richards at the #IndvsNZ Semi-final 😎❤️ pic.twitter.com/6A5MvqRZrn
— Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2023
ఇక 1983లో జరిగిన మూడో వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్-వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన విండీస్‌ను కేవలం 140 పరుగులకే కుప్పకూల్చి తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో రిచర్డ్స్ అందించిన క్యాచ్‌ను భారత్ కెప్టెన్ కపిల్ దేవ్ దాదాపు 30 అడుగులు వెనక్కి పరుగెత్తి అందుకోవడం హైలైట్. అక్కడినుంచి వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. కపిల్ పట్టిన ఆ క్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. కాగా ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఆడేందుకు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌బీర్ కపూర్, జాన్ అబ్రహాం, సిద్దార్థ్ మల్హోత్రా మరియు హీరోయిన్ కియారా అద్వానీ తదితరులు కూడా హాజరయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: