మంచి మనసు చాటుకున్న చైతు

naga chaitanya visited st jude child care

మన హీరోలు రీల్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము చేసే పనుల వల్ల హీరోలనిపించుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు..ఎంతోమందికి హెల్ప్ చేస్తూ తమ ఉదారతను చాటుతూనే ఉంటారు. ఇక తాజాగా నాగ చైతన్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. హైద్రాబాద్ లోని సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో నాగచైతన్య కాసేపు గడిపారు. అక్కడ వారితో కాసేపు సరదాగా ఆటలు ఆడి పిల్లలను సంతోషపరిచారు. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక చైతు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితం ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈసినిమాలో నాగ పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈసినిమా కోసం నాగ చైతన్య మేకోవర్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.