టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో అజయ్ భూపతి ఒకరు. తొలి ప్రయత్నంలోనే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా ‘మహాసముద్రం’ అనే సినిమాను రూపొందించగా.. అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా, ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. కాగా అజయ్ భూపతి ప్రస్తుతం మూడో సినిమాగా ‘మంగళవారం’ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఆయన ఈ సారి హారర్-థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరం. ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తాను పరిచయం చేసిన పాయల్ రాజ్‌పుత్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా రేపు (నవంబర్ 17, 2023) దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ‘మంగళవారం’ మూవీకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌తో ‘మంగళవారం’ సినీ ప్రియులందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాగే రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా ‘మంగళవారం’ మేకింగ్ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. ‘మేకింగ్ ఆఫ్ మంగళవారం’ అని విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా అంతకుముందు ‘కీడా కోలా’ ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన ‘అప్పడప్పడ తాండ్ర’ అనే పాటను రిలీజ్ చేయగా దానికి మంచి అప్లాజ్ వచ్చింది.
కాగా ‘మంగళవారం’ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ అనే బ్యానర్‌పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మలతో కలిసి అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ‘ఏ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకి కన్నడ ఆల్ టైం సూపర్ హిట్ ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా ‘మంగళవారం’ సినిమాను నవంబర్ 17వ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: