శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ వల్ల రిలీజ్ డేట్ మార్చారు. ఫైనల్లీ నవంబర్ 24వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. నవంబర్ 17వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for an action-packed ride, #Aadikeshava theatrical trailer dropping on Nov 17th! 🔥 😎
In Cinemas #AadikeshavaOnNov24th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/eSim0iEtUI
— Sithara Entertainments (@SitharaEnts) November 15, 2023
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. అపర్ణా దాస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: