కంగువా లో హైలెట్ గా ఆరు ఫైట్లు

six different action sequences in suriyas kanguva movie

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. చెన్నైలో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా లో ఆరు యాక్షన్ సీకెన్స్ లు ఉంటాయట. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయట. అంతేకాదు ఈ ఆరు ఫైట్లు కూడా ఒక్కో జోనర్ లో సెట్ చేసినట్టు తెలుస్తుంది. 3అండర్ వాటర్ లో, ఫారెస్టులో, బీచ్ లో, బోట్ లో, ఫ్లైట్ లో, జిమ్ లో ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి అవి ఎక్స్ పీరియన్స్ చేయాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 19 =