ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను ఏ ఏరియాలో ఎవరు రిలీజ్ చేస్తున్నారో వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే కేరళలో ఈసినిమమాను పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనున్నట్టు తమిళ్ లో రెడ్ గెయింట్ మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఏపీ రిలీజ్ వివరాలకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఆవివరాలు ఒకసారి చూద్దాం..
ఉత్తరాంధ్ర- శ్రీ సిరి సాయి సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు.
ఈస్ట్ గోదావరి- లక్ష్మీ నరసింహా శ్రీ మణికంఠ ఫిలింస్
వెస్ట్ గోదావరి- గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్
కృష్ణ అండ్ గుంటూరు- కేఎస్ఎన్ టెలీ ఫిలింస్
నెల్లూరు- శ్రీ వెంగమాంబ సినిమాస్
సీడెడ్- శిల్పకళా ఎంటర్ టైన్మెంట్స్ వారు సలార్ హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేయనున్నారు.
We’re pleased to announce our collaboration with the Andhra Pradesh distributors to bring #SalaarCeaseFire to the audience of 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡!#Salaar Trailer on Dec 1st at 7:19 PM 🔥#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur… pic.twitter.com/lAuXspNWEy
— Hombale Films (@hombalefilms) November 15, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: