ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో 70 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఒడిసి పట్టుకునేందుకు టీమ్ ఇండియా మరొక్క అడుగు దూరంలో నిలిచింది. దీనికితోడు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. తద్వారా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా కోహ్లీకి ఇది 50వ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ రికార్డు తర్వాత కోహ్లీ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే.. అందులో హీరోగా ఎవరు నటిస్తారని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్ కపూర్ స్పందించారు. కాగా రణ్‌బీర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిన్నటి ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు హాజరైన సందర్భంగా రణ్‌బీర్ కపూర్.. కోహ్లీ బయోపిక్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత, ఇండియా బ్యాటింగ్ అనంతరం.. రణ్‌బీర్ కపూర్‌ని ఒక మీడియా ప్రతినిధి మాట్లాడించారు. ఈ సందర్భంగా కోహ్లీ బయోపిక్‌లో మీరు నటించాలనుకొంటున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. “విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమాగా తీస్తే.. అందులో అతడే నటించాలి. ఎందుకంటే కోహ్లీ ఇండియాలో ఉన్న చాలా మంది నటులకంటే అందంగా, ఫిట్‌గా ఉంటాడు. అందుకే ఆ రోల్‌ను కోహ్లీనే పోషించాలి” అని రణ్‌బీర్ తెలిపాడు. కాగా రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఇదిలా ఉంటే.. ఇంతకుముందు ఒకసారి ఇదే విషయమై టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా స్పందించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఒకవేళ విరాట్ బయోపిక్ తీస్తే.. అందులో తాను నటించాలని కోరుకుంటున్నా అంటూ చరణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమాగా రావాలని అటు క్రికెట్ ప్రేమికులతో పాటుగా.. ఇటు మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. కాగా గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో బయోపిక్ మూవీలు రూపొందుతోన్న క్రమంలో త్వరలోనే విరాట్ బయోపిక్ తీయడానికి ఎవరైనా ప్రముఖ దర్శకుడు ముందుకు వచ్చే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























