కోహ్లీ వరల్డ్ రికార్డ్ పై సెలబ్రిటీల రియాక్షన్

tollywood celebrities praises on virat kohli

నిన్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో భాగంగా కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. నిన్న సెమీ ఫైనల్స్ లో భాగంగా న్యూజిలాండ్ కు అలానే ఇండియాకు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ 50వ శతకం సాధించాడు. అంతేకాదు లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ సెంచరీల రికార్డును బద్దలు కొట్టి తన పేరుతో వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా అందరూ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా సినీ సెలబ్రిటీలు కూడా తమ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కోహ్లీకి అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా.. రికార్డ్స్ ఉన్నదే బద్దలు కొట్టడానికి.. అయితే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు’ అంటూ ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా.. 49 వన్డే సెంచరీలు. ఇది తిరుగులేని రికార్డు. దీనిని ఇండియాలో ఒక భారతీయుడు బ్రేక్ చేశాడు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో దీని కంటే మెరుగైనది మరొకటి లేదు. కంగ్రాట్స్ కోహ్లీ. మీరు 50 స్టాండింగ్ ఒవేషన్‌లకు అర్హులు అంటూ ట్వీట్ చేశారు.

ఇక విక్టరీ వెంకటేష్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కోహ్లీ ని అభినందించారు. వెంకటేష్ స్వయంగా మ్యాచ్ ను వీక్షించారు. ఈనేపథ్యంలో వాంఖడే స్టేడియంలో కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డును స్వయంగా చూసినందుకు ఎంతో హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేశారు.

సాయితేజ్ కూడా తన ట్విట్టర్ ద్వారా అప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ ఇప్పుడు ఓన్లీ కింగ్ కోహ్లీ, వన్ అండ్ ఓన్లీ ఫరెవర్ ఇండియా.. కంగ్రాట్స్ కోహ్లీ అంటూ ట్వీట్ చేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =