సప్త సాగరాలు దాటి – సైడ్ బి రివ్యూ

Sapta Sagaralu Dhaati Side B Movie telugu review

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి-సైడ్ ఏ. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈసినిమా ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంది.. ఫస్ట్ పార్ట్ హిట్ అయినట్టు సెకండ్ పార్ట్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర ఆచర్ అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు
దర్శకత్వం.. హేమంత్ ఎం రావు
నిర్మాత..రక్షిత్ శెట్టి
సంగీతం.. చరణ్ రాజ్
సినిమాటోగ్రఫి.. అద్వైత గురుమూర్తి

కథ..
ఫస్ట్ పార్ట్ ఎక్కడ పూర్తవుతుందో సెకండ్ పార్ట్ అక్కడినుండే మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ లో మను(రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వాసంత్‌) ప్రేమికులు. ఇక ప్రియకు సముద్రం అంటే ఎంతో ఇష్టముంటుంది. ఎప్పుడూ సముద్ర తీరంలో ఇల్లు కట్టుకోవాలని తన కోరికను మనుతో చెబుతుంటుంది. ఇక ప్రియ కోరికను తీర్చడానికి చేయని నేరాన్ని తనపై వేసుకోని జైలుకు వెళతాడు మను (రక్షిత్ శెట్టి). అయితే అక్కడ తనను విడిపిస్తారనుకున్న వాళ్లు మోసం చేయడంతో జైలులోనే ఉండాల్సి వస్తుంది.

ఇక సెకండ్ పార్ట్ లో జైలు నుండి బయటకు వస్తాడు మను. తను బయటకు వచ్చే సరికి తను ప్రాణంగా ప్రేమించిన ప్రియకు పెళ్లైపోయిందని తెలుస్తుంది. ఇక ఒకవైపు తనని మోసం చేసిన వారి మీద పగ తీర్చుకోవాలని.. మరోవైపు ప్రియ జ్ఞాపకాలతో బాధపడుతుంటాడు. అంతేకాకుండా పెళ్లైన తరువాత ప్రియా సంతోషంగా లేదని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో తన లైఫ్ లోకి సురభి (చైత్ర జె అచార్) వస్తుంది. ఆమె రాకతో మను జీవితం ఎలా మారింది? ప్రియా సంతోషం కోసం మను ఏం చేశాడు? తన జీవితాన్ని నాశనం చేసి వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ..

ఎమోషనల్ లవ్ స్టోరీస్ కు ప్రేక్షకులు ఎప్పుడూ కనెక్ట్ అవుతుంటారు. అందులోనూ కాస్త విషాదాంతం లవ్ స్టోరీస్ కు మరింత ఆదరణ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే సప్త సాగరాలు దాటి. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కన్నడ లో సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా మంచి హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా వచ్చేసింది. మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఈ పార్ట్ పై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ పార్ట్ లో హీరో అగ్రెసివ్ నెస్ తో పాటు ప్రేమించిన అమ్మాయి మరొకరి భార్య అయినప్పటికీ, ఆమె సంతోషం కోసం హీరో ఏం చేశాడు అన్నది చూపించారు. అయితే ఇలాంటి ప్రేమకథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిజం చూపించే ఎలిమెంట్స్ లాంటివి ఉండవు. కేవలం ఎమోషన్స్ తోనే సినిమాను నడపాల్సి ఉంటుంది. అది అంత ఈజీ ఏం కాదు.. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ ను ఎమోషన్స్ తోనే ఎంగేజ్ చేయాలంటే ఎంతో కష్టం. కానీ ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కీలక పాత్రధారుల నుంచి ఎమోషన్స్‌ను రాబట్టడంలో హేమంత్‌ బెస్ట్‌ అనిపించుకున్నారు.

పెర్ఫామెన్స్

ఈసినిమాకు ప్రధాన బలం రక్షిత్ శెట్టి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషనల్ లో జీవించేశాడు. రక్షిత్ శెట్టి ఎమోషనల్ పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ కూడా కంటతడి పెట్టకుండా ఉండలేరు. రుక్మిణీ వసంత్‌ పాత్ర ఈ పార్ట్ లో నిడివి తక్కువ ఉన్నప్పటికీ.. ఉన్నంత సేపు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈపార్ట్ లో ఆకట్టుకునే మరో పాత్ర చైత్ర అచార్ ది అని చెప్పొచ్చు. వేశ్య పాత్రలో చాలా బాగా చేసింది. కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించి ఆకట్టుకుంది. మిగిలిన పాత్రల్లో ఎవరికి వారు బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఇక టెక్నికల్ విభాగానికి వస్తే ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా ప్లస్ పాయింట్. పాటల సంగతి పక్కన పెడితే చరణ్ రాజ్ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రాఫర్‌ అద్వైత గురుమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని సీన్లు రియాలిటీకి ఏ మాత్రం తీసిపోకుండా తన కెమెరా పని తనాన్ని చూపించాడు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఎమోషలన్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =