Home Blog

పవన్ కళ్యాణ్ సతీమణి గ్రాడ్యుయేషన్ వేడుక‌, వీడియో వైరల్

AP Deputy CM Pawan Kalyan Attends Graduation Ceremony of His Wife Anna Lezhneva

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ త‌న సతీమణి అన్నా లెజినోవా కొణిదెల గ్రాడ్యుయేషన్ వేడుక‌కు హాజరయ్యారు. ఈ మేరకు శనివారం సింగపూర్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ వేడుకకు ఆయన ప్రత్యేకంగా హాజరయ్యారు. కాగా అన్నా లెజినోవా మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా నేడు ఆమె డిగ్రీ ప‌ట్టా అందుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు లెజినోవా భర్త, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ ద‌ర్శ‌క‌త్వం వహించగా 2011లో విడుదలైన ‘తీన్‌మార్’ అనే చిత్రంలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా క‌లిసి న‌టించారు. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారి అనంతరం 2013లో పెళ్లి చేసుకున్నారు. కాగా పవన్-అన్నా జంటకు పొలినా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్ లో హరోంహర

sudheer babu harom hara movie trending no 1 in india

ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబుకు హరోంహర అనే సినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా కుప్పం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా ఈసినిమా ఒక ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ఆహావారు అలానే ఈటీవీ విన్ వారు అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఈసినిమా ఓటీటీల్లో రిలీజ్ అయి సందడి చేస్తుంది. అంతేకాదు ఓటీటీలో కూడా ఈసినిమా దూసుకుపోతుంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా టాప్1 లో ట్రెండ్ అవుతోంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.

కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుమంత్‌ జీ నాయుడు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆయ్ థీమ్ సాంగ్ రిలీజ్

theme song out from narne nithin aay movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా సూపర్ హిట్ నే అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు. గోదావరి జిల్లాలో ఆయ్ అనేది వాడుక పదం అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇదే పదాన్ని సినిమా టైటిల్ గా పెట్టడంతోనే సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సూఫియానా, రంగనాయకి అనే పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈసినిమా థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈసాంగా లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు మేకర్స్. సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించిన ఈపాటను అనంత్ సిద్దార్థ్, మోక్షిత్ ఈపాటను ఆలపించారు.

కాగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా వస్తున్న ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార బర్త్ డే.. మహేష్ బాబు, నమ్రత పోస్టులు వైరల్

Sitara Birthday Mahesh Babu and Namrata Shirodkar Posts Goes Viral

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల ముద్దుల తనయ సితార ఘట్టమనేని నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేష్, నమ్రత సోషల్ మీడియా వేదికగా తమ గారాల పట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సితారకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. నమ్రత అయితే సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు కలగలిపి ఓ ప్రత్యేక వీడియో క్రియేట్‌ చేసి ఇన్‌స్టా వేదికగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం మహేష్, నమ్రత దంపతులు పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా సితార చదువుతోపాటు చిన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. గత ఏడాది తన పుట్టిన రోజున కొందరు విద్యార్థినిలకు సైకిళ్లు బహుమతిగా ఇచ్చింది. అలాగే అనాథ పిల్లల కోసం తన తండ్రి మహేష్ నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించింది. ఇంకా ఓ నగల దుుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు ఆ ప్రకటన ద్వారా వచ్చిన పారితోషికాన్ని పేదవారికోసం వినియోగించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిద్దు జొన్నలగొడ్డ తెలుసుకదా లాంగ్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్

siddhu jonnalagadda telusu kada movie long schedule shooting update

ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. దానికితోడు ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు

ఈసినిమా షూటింగ్ కు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ 5 వ తేదీ నుండి హైద్రాబాద్ లో ప్రారంభించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా లాంగ్ షెడ్యూల్ ను ఆగష్ట్ 5వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో రాశీ ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ప్రారంభించిన ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్

senior actor Murali Mohan inaugurated Dr Alekhya Rallapallis Astrid Dermatology and Cosmetology Clinic

డెర్మటాలజీ, కాస్మొటాలజీలో ఏడేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ను సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ చేతుల మీదుగా తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో కేబీఆర్ పార్క్ ఎదురుగా టిడిపి ఆఫీస్ రోడ్ లో జిమ్ ఖానా క్లబ్ పక్కన ఈ క్లినిక్ ఏర్పాటు చేశారు. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కు ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ లో అత్యంత ఆధునిక, మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నటులు భాస్కర్, సీనియర్ పాత్రికేయులు జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ – ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. మంచి స్పేషియస్ గా అందమైన ఇంటీరియర్ తో, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తో ఈ క్లినిక్ ను డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి గారు, వారి హజ్బెంట్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఉన్న డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ఇది. ఇక్కడి వారంతా ది బెస్ట్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్ మెంట్ కోసం ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ సేవల్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ క్లినిక్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని అన్నారు.

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – మనవూరి పాండవులు సినిమాలో కీలక పాత్రలో నటించిన భాస్కరరావు గారి కొడుకు తేజ, కోడలు డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి కలిసి ఈ ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ఏర్పాటు చేశారు. మురళీ మోహన్ గారు ఈ క్లినిక్ ప్రారంభించడం సంతోషకరం. ప్రైమ్ లొకేషన్ లో లేటెస్ట్ ఎక్విప్ మెంట్ తో ఏర్పాటైన ఈ క్లినిక్ సేవల్ని అవసరమైన వారంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు.

డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి మాట్లాడుతూ – లాబెల్ స్కిన్ క్లినిక్ లో ఏడేళ్లు వర్క్ చేశాను. ఏడేళ్ల అనుభవం తర్వాత సొంతంగా ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కేబీఆర్ పార్క్ ఎదురుగా ప్రారంభించాం. ఇందుకు సపోర్ట్ చేసిన మావారు తేజకు థ్యాంక్స్ చెబుతున్నా. మా క్లినిక్ ను లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారి చేతుల మీదుగా లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్ మాకు దొరికాయి. మా క్లినిక్ లో స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ కు ది బెస్ట్ ట్రీట్ మెంట్ అందిస్తాం. కెమికల్ పీలింగ్, లేజర్ హెయిర్ రిడెక్షన్, లేజర్ టోనింగ్, కార్బన్ పీలింగ్, బొటాక్స్, పిల్లర్, యాక్నే ట్రీట్ మెంట్, త్రెడ్ లిఫ్ట్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ తదితర చికిత్సలు, పీడియాట్రిక్ డెర్మటాలజీ కూడా అందుబాటులో ఉందని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవర.. డబ్బింగ్ పూర్తి చేసిన నటుడు

Temper Vamsi Finished His Dubbing For Devara

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘జన‌తా గ్యారేజ్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ఫియర్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో మిలియన్లకుపైగా వ్యూస్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో దేవర సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న నటుడు టెంపర్ వంశీ తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలిపిన ఆయన.. దేవర పార్ట్ 2లో ఎన్టీఆర్ అన్నతో కలిసి నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

ఇక హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా, సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తీర ప్రాంతం నేపథ్యం, ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరిపోదా శనివారం-సూర్య పవర్ ఫుల్ బర్త్ డే గ్లింప్స్

sj suriya special glimpse out from nanis saripodhaa sanivaaram movie

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఈసినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు.

దీనిలో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో స్పెషల్ వీడియోతో వచ్చేశారు. నేడు ఎస్ జే సూర్య పుట్టినరోజు కావడంతో తన స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . నాట్ ఏ టీజర్ అంటూ వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. పురాణాల్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.. ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతుండేవాడు.. అంటూ ఎస్ జే సూర్య ను చూపిస్తారు. టీజర్ ను బట్టి చూస్తే ఎస్ జే సూర్య పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో అర్థమవుతుంది. యాక్షన్ ఎలిమెంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్ సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. అంతేకాదు పాటలను కూడా వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. గరంగరం, ఉల్లాసం అనే రెండు పాటలను రిలీజ్ చేశారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై  నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమార్కుడు రీ-రిలీజ్‌ ట్రైలర్ వచ్చేసింది

Ravi Teja’s Vikramarkudu Re-release Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,Vikramarkudu Re Release Trailer,Vikramarkudu Movie Re Release Trailer,Vikramarkudu Trailer,Vikramarkudu Movie Trailer,Ravi Teja Vikramarkudu Re Release Trailer,Vikramarkudu,Vikramarkudu Movie,Ravi Teja Vikramarkudu Movie,Vikramarkudu Telugu Movie Re Release Trailer,Vikramarkudu Trailer,Vikramarkudu Movie Trailer,Vikramarkudu Telugu Movie Trailer,Ravi Teja,Anushka,SS Rajamouli

టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‌ ట్రెండ్ నడుస్తుండటం తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల చిత్రాలను మేకర్స్ మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా హీరోల అభిమానులు మరోసారి తమ ఫేవరేట్ హీరోను బిగ్ స్క్రీన్‌పై చూసి మురిసిపోతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు అగ్ర హీరోల సినిమాలు రీ-రిలీజ్‌ అయ్యి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇదే కోవలో తాజాగా మరో స్టార్ హీరో మూవీ ఒకటి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా త్వరలో రీ-రిలీజ్‌ కాబోతోంది. 2006లో విడుదలైన ఈ చిత్రం నాడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. తాజాగా ఈ సినిమాను తెలుగునాట టాప్ లీడింగ్ డిజిటల్ మీడియా అయిన ‘మ్యాంగో మాస్ మీడియా’ జూలై 27న ప్రేక్షకులముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో శనివారం 4కే వర్షన్‌లో విక్రమార్కుడు రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది.

ఇక ఇదిలావుండగా, రవితేజ ఇతర సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీకి క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

దీనితోపాటు మరోవైపు రవితేజ మైల్ స్టోన్ మూవీ #RT75 నిర్మాణ దశలో ఉంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పేకమేడలు మూవీ రివ్యూ

peka medalu movie telugu review

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడిగా, హీరోగా, నిర్మాతగా సక్సెస్ అందుకున్న వ్యక్తి రాకేష్ వర్రే. మొదట చిన్న క్యారెక్టర్లతో కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత ‘బాహుబలి’లో ఐకానిక్ సీన్ వరకు ఆయనది ఇన్‌స్పైరింగ్ జర్నీ. ‘ఎవ్వరికి చెప్పొద్దు’ వంటి సెన్సిటివ్ ఫీల్ గుడ్ మూవీతో హీరోగా, నిర్మాతగా సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఈసారి ‘పేకమేడలు’ అంటూ సెన్సిబుల్ సినిమాతో నిర్మాతగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వినోద్ కిషన్, అనూష క్రిష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు నచ్చడంతో ఈ సినిమా గురించి రానా దగ్గుబాటి, సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్ తదితర సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. సినిమాపై నమ్మకంతో విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలు వేశారు. మంచి సినిమా ముద్రతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పేకమేడలు విషయం ఏమిటో సమీక్షలో చూసేద్దాం… 

నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
మ్యూజిక్: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.
ప్రొడ్యూసర్: రాకేష్ వర్రే
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
రైటర్ – డైరెక్టర్: నీలగిరి మామిళ్ల

కథ

బీటెక్ చదివిన లక్ష్మణ్ (వినోద్ కిషన్)ది హైదరాబాద్ సిటీలోని ఓ బస్తీ. ఉద్యోగం ఏదీ చేయడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటూ పైసా సంపాదన లేకుండా భార్య మీద పడి బతికేస్తుంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పని చేయడంతో పాటు పిండి వంటలు చేసి ఒక షాపు యజమానికి ఇవ్వడం ద్వారా కుటుంబ బాధ్యతల చూసుకుంటుంది లక్ష్మణ్ భార్య వరలక్ష్మి (అనూష క్రిష్ణ). 

పిండి వంటల అమ్మకం ద్వారా వచ్చే సంపాదన సరిపోవడం లేదని, కుటుంబ పోషణతో పాటు పిల్లాడికి మెరుగైన జీవితం కోసం కర్రీ పాయింట్ పెడితే మంచి డబ్బులు వస్తాయని వరలక్ష్మి అనుకుంటుంది. అందుకు 50 వేలు అవసరం అవ్వడంతో భర్తను అడుగుతుంది. భార్య పేరు చెప్పి స్నేహితుల దగ్గర లక్ష్మణ్ అప్పు చేస్తాడు. కానీ, ఆ డబ్బు ఆమెకు ఇవ్వడు. అమెరికన్ ఎన్నారై శ్వేతా (రితిక శ్రీనివాస్)ను ట్రాప్ చేయడానికి వాడతాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి సక్సెస్ ఫుల్ గా ట్రాప్ చేస్తాడు. భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు. 

లక్ష్మణ్ నిజస్వరూపం శ్వేతాకు తెలిసిందా? శ్వేతా గురించి వరలక్ష్మికి తెలిసిందా? ముగ్గురి జీవితాలు ఎటువంటి మలుపులు తీసుకున్నాయి? ఎన్ని గొడవలు జరిగాయి? చివరకు ఏమైంది? అనేది క్లుప్తంగా పేకమేడలు కథ. 

పేకమేడలు ఆర్టిస్ట్స్ ఎఫర్ట్స్:
హీరో వినోద్ కిషన్‌కు ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. అయితే నటుడిగా ఆయనకు అనుభవం ఉంది. తమిళ సినిమాలు నా పేరు శివ’, అంధగారంలో నటుడిగా తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. పేకమేడలులో బస్తీలో నివసించే భర్తగా ఒదిగిపోయాడు. లుక్స్, డ్రసింగ్, యాక్టింగ్ నుంచి ప్రతి విషయంలో పర్ఫెక్షన్ చూపించాడు. లక్ష్మణ్ లాంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టును ఓవర్ షాడో చేసింది హీరోయిన్ అనూష క్రిష్ణ. 

పేకమేడలు సినిమాకు అనూష క్రిష్ణ నటన ఆయువు పట్టుగా నిలిచింది. పతాక సన్నివేశాలు చూశాక వరలక్ష్మి పాత్రలో ఆవిడ తప్ప మరొకరు నటించలేరని అనిపిస్తుంది. అంత సహజంగా చేసింది. హీరో హీరోయిన్ల తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ రితిక శ్రీనివాస్ పోషించిన శ్వేతా. గ్లామర్ షో చెయ్యకుండా ఆ ఫీలింగ్ తెచ్చింది. మిగతా క్యారెక్టర్లు ఓకే. వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

పేకమేడలు టెక్నీషియన్స్ ఎఫర్ట్స్:
కథకు తగ్గ టెక్నీషియన్స్ పేకమేడలు సినిమాకు దొరికారు. స్మరణ్ సాయి ట్యూన్స్ బావున్నాయి. రీ రికార్డింగ్ కూడా బాగా చేశారు. హైదరాబాదీ మ్యూజిక్ కొన్ని చోట్ల వినిపించింది. హరిచరణ్ కె కెమెరా వర్క్ నేటివ్ ఫీల్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యింది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సీన్లు ఇంటర్వెల్ ముందు కొన్ని ఉన్నాయి. మూవీ రన్ టైమ్ తక్కువే. కానీ, ఫస్టాఫ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కువ టైమ్ తీసుకున్నారు. 

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడు నీలగిరి మామిళ్ల రాసుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో మంచి సపోర్ట్ అందించారని మూవీ చూస్తే తెలుస్తుంది. 

పేకమేడలు విశ్లేషణ:
పేకమేడలు ఆఫ్ బీట్ ఫిల్మ్ అన్నట్టు టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తే కొందరికి అనిపించవచ్చు. కానీ, ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ బాధ్యత లేని భర్తలు వల్ల భార్యలు పడే కష్టానికి మిర్రర్ ఇమేజ్ అన్నట్టు ఉంటుంది. సొసైటీలో, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో జరిగే సందర్భాలకు ప్రతిరూపం అన్నట్టు సినిమా ఉంది. 

పేకమేడలు సినిమా చూస్తుంటే బస్తీల్లోని ఇళ్లల్లో జరిగే విషయాలను దర్శకుడు అంత అద్భుతంగా ఎలా క్యాప్చర్ చెయ్యగలిగారని ఆశ్చర్యం కలుగుతుంది. హీరో హీరోయిన్లతో పాటు మిగతా క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం కొంత టైమ్ తీసుకున్నారు. కానీ, కామెడీతో బోర్ కొట్టకుండా రన్ చేశారు. ఒక్కసారి బి భర్త చేసే పనులు భార్యకు తెలిసిన తర్వాత సినిమా ఆగలేదు. పరుగులు పెట్టింది. యాక్షన్ లేదు, కామెడీ లేదు, కానీ ఆ ఎమోషనల్ సీన్లు వస్తుంటే రెప్ప వెయ్యకుండా మూవీ చూసేలా ఉంటుంది. క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ అనూష క్రిష్ణ నటన సైతం అద్భుతం. పేకమేడలు ప్రారంభం నిదానంగా మొదలైన ఆ ఫీలింగ్ థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉండదు. క్లైమాక్స్ ఇచ్చిన హైతో బయటకు వస్తాం. ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా వార్తలు

తప్పక చదవండి