అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను అలానే వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇక రిలీజ్ కు మరికొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో జోరు మరింత పెంచారు. ఇక తాజాగా ఈసినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చింది రష్మిక మందన్న. ఈ సినిమా డబ్బింగ్ పూర్తయినట్టు తెలిపింది. తెలుగు, హిందీ, కన్నడ మూడు భాషల్లోనూ డబ్బింగ్ పూర్తినట్టు తన ఇన్ట్సా ద్వారా పోస్ట్ చేసింది.
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: